
హైదరాబాద్: ఐపిఎల్ లో భాగంగా కోల్ కతా నైట్ రైడర్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. కెకెఆర్ పై డిసి 40 పరుగుల తేడాతో గెలిచి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. నాలుగు జట్లు ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించాయి. ఆర్ సిబి 18 పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా నెట్ రన్ రేటు ఆధారంగా వరసగా జిటి, ఎస్ఆర్ హెచ్ జట్లు ఉన్నాయి. ఆర్ఆర్ 16 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఈ సందర్భంగా ఢిల్లీ కెప్టెన్ అక్షర పటేల్ మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టులో నలుగురు బ్యాట్స్ మెన్లు అద్భుతమైన ఫామ్ లో ఉండడంతో ఆ జట్టే ఐపిఎల్ కప్పు గెలిచే అవకాశం ఉందని జోస్యం చెప్పాడు. హెన్రీచ్ క్లాసెన్ 606 పరుగులు, ఇషాన్ కిషన్ 566, అభిషేక్ శర్మ 563 పరుగులతో ఫామ్ లో ఉన్నారని తెలియజేశారు. ఆర్ సిబితో జరిగిన మ్యాచ్ లో ముగ్గురు బ్యాటర్లు మెరుపులు మెరిపించడంతో ఆ జట్టు 255 పరుగులు చేసిన విషయం తెలిసిందేన్నారు. ఎస్ఆర్ హెచ్ లో ప్రమాదకరమైన ఓపెనర్ ట్రావిస్ హెడ్ కూడా ఉన్నాడని, అతడు ఫామ్ లోకి వస్తే ఆపడం ఎవరు తరం కాదని పటేల్ పేర్కొన్నాడు. పాట్ కమిన్స్ హైదరాబాద్ జట్టుకు అదనపు బలం అని కొనియాడారు. ఎస్ఆర్ హెచ్ అడ్డుకోవడం కష్టమేనని తెలిపాడు.













